
బాపట్ల:29-10-25:- మొంథా తుఫాన్ ప్రభావంతో పర్చూరు నియోజకవర్గంలో ఏర్పడిన వరద పరిస్థితిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, తాసిల్దార్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.మంత్రి లోకేష్ ఫోన్‌లో ఆరా
తుఫాన్ ప్రభావంపై మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే ఏలూరిని ఫోన్‌లో సంప్రదించారు. వరద పరిస్థితులు, నష్టం అంచనాలు, ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ, “ముందస్తు చర్యలతో నష్టం చాలా వరకు తగ్గించగలిగాం. బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహారం అందిస్తున్నాం. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరూ టీమ్‌గా పనిచేయడంతో పరిస్థితిని నియంత్రించగలిగాం” అని తెలిపారు.

పర్చూరులో ముంపు సమస్య పరిష్కారంపర్చూరు, నాగులపాలెం ప్రాంతాల్లో ఏర్పడిన ముంపు సమస్యను ఎమ్మెల్యే ఏలూరి కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే చర్యలు చేపట్టారు. చీరాల–చిలకలూరిపేట హైవేపై నిలిచిపోయిన నీటిని మళ్లించేందుకు యుద్ధప్రాతిపదికన కాలువ తీయించి, ముంపు నీరు బయటకు పంపించారు. దీంతో ప్రజలకు ఊరట లభించింది.డ్రోన్ సాయంతో రక్షణ చర్యలు
పర్చూరు వాగులో కొట్టుకుపోయిన షేక్ మున్నాను డ్రోన్ సాయంతో గుర్తించి, పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడారు.

ఈ చర్యకు పర్చూరు ఎస్ఐ జీవీ చౌదరి, పోలీసు బృందం ధైర్యసాహసాలను ఎమ్మెల్యే ఏలూరి ప్రశంసించారు.రైల్వే సిబ్బందిని కాపాడిన ధైర్యవంతులు
చినగంజాం మండలం నీలాయపాలెం–ఉప్పుగుండూరు రోడ్డుపై వరదనీటిలో చిక్కుకున్న రైల్వే సిబ్బందిని ఇంకొల్లు సీఐ రమణయ్య ఆదేశాలతో కానిస్టేబుల్ అన్వర్ భాష, హోంగార్డ్ శివశంకర్‌రెడ్డి ప్రాణాపాయ స్థితిలోనుండి రక్షించారు. ఈ సేవను ఎమ్మెల్యే ఏలూరి అభినందించారు.గర్భిణి ప్రాణాన్ని కాపాడిన ఎస్ఐ సురేష్‌ఇంకొల్లు మండలం కట్టావారిపాలెం గ్రామంలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి టి.కీర్తిని ఎస్ఐ సురేష్ స్వయంగా తన వాహనంలో ఏఎన్‌ఎంల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు డా.టి.అంజలి చికిత్సతో గర్భిణి ఇద్దరు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఏలూరి స్పందిస్తూ, “ప్రజాసేవలో ఇలాంటి స్పందన ప్రతి అధికారికి ఆదర్శం కావాలి” అన్నారు.బర్లీ రైతులతో మాటామంతీబర్లీ మండలంలో వరద ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఎమ్మెల్యే ఏలూరి రైతులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.“ప్రజల రక్షణే మా ధ్యేయం”ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలు ముఖ్యం. కష్టకాలంలో ప్రజలతోపాటు నిలబడటమే మా బాధ్యత. ఎవ్వరూ వెనుకాడకూడదు. ప్రభుత్వ యంత్రాంగం సమయానికి స్పందిస్తేనే ప్రజల నమ్మకం పెరుగుతుంది” అన్నారు.తుఫాన్ అనంతరం మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో నియోజకవర్గవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు అందజేశారు.“కష్టకాలంలో సేవ చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” — ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు







