సికింద్రాబాద్- కంటోన్మెంట్:రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో దెబ్బతిన్న నాలాలు, రోడ్లు మరియు ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీగణేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి సందర్శించి, వారి బాధలు తెలుసుకొని పరిస్థితి చక్కదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెప్పారు. 150 డివిజన్ అంబేద్కర్ నగర్,వార్డు5 ఏఓసి అపార్ట్‌మెంట్ రెసిడెన్స్, వాసవి కాలనీ, గృహలక్ష్మి కాలనీ, వార్డు4 లక్ష్మీ నగర్, పికెట్ సుబ్బారావు కాలనీలలో దెబ్బతిన్న నాలాలు, ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించి అధికారులతో పరిస్థితి సమీక్షించి త్వరలోనే పరిస్థితిని బాగు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.
213 Less than a minute