
vijayawada:గుణడల, అక్టోబర్ 14:-పేద కుటుంబాల ఆశలకు చిరునామాగా మారుతున్న వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు మన కంటిపాపలు అని, వారిని సొంత పిల్లలకంటే ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన గుణడలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్‌లోని తాగునీటి నాణ్యతను పరిశీలించడంతో పాటు గదులు, ప్రాంగణాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రతి వసతి గృహానికి ఓ జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాం. వారంతా వారానికి రెండుసార్లు హాస్టల్‌ను సందర్శించి ఆహారం, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ఆన్‌లైన్ నివేదికలు సమర్పిస్తున్నారు,” అని తెలిపారు.తాగునీటి క్లోరిన్ పరీక్షలు రోజూ నిర్వహిస్తున్నట్టు, నైట్రేట్ పరీక్షలు వారానికి ఒకసారి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆహార భద్రతా అధికారులు హాస్టళ్లను సందర్శించి నమూనాలు పరీక్షిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం వైద్య బృందాలు నిరంతరం సేవలందిస్తున్నాయని వివరించారు.విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, వసతి గృహాల్లో చదివి స్థిరపడిన పూర్వ విద్యార్థులతో మోటివేషన్ సెషన్లు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.”విద్యార్థులు బాగా చదివి తమ తల్లిదండ్రులకు, రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకురావాలి” అంటూ కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్శనలో కలెక్టర్‌తో పాటు వసతి గృహ ప్రత్యేక అధికారి మరియు డీపీవో శ్రీమతి పి. లావణ్యకుమారి, సంక్షేమ అధికారి ఎ. రజనీ కుమారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







