తిరుపతికి చెందిన వేద పండితుడు దూవ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు గౌరవ పాఠం నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని సత్య సాయి కల్యాణ మండపంలో గురువారం జరిగింది.
ఈ వేద సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది వేద పండితులు హాజరయ్యారు. వేద పాఠాలు నిర్వహించిన పండితులు:
- కడియాల వేంకట సత్య సీతారామ ఘనపాఠి
- శృంగేరి అస్థాన విద్వాంసులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి
- విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వర ఘనపాఠి
- గుళ్లపల్లి విశ్వనాథ ఘనపాఠి
- విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాఠి
- హైదరాబాద్‌కు చెందిన హరి సీతారామమూర్తి సలక్షణ ఘనపాఠి
- వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి
ఈ కార్యక్రమంలో వేద పండితులు వేదాల విశిష్టతను వివరించారు. వేద ధ్వనితో సమాజ వికాసమే కాకుండా వాతావరణం కూడా పవిత్రం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచానికి రక్ష ధర్మమే, ఆ ధర్మానికి మూలం వేదమేనన్నారు.
అనంతరం వందలాది మంది వేద పండితులు ఒకేసారి పలికిన వేద స్వస్తితో అమలాపురం పట్టణం పునీతమైంది. కోనసీమ భాష వేద ఘోష అన్నట్లుగా స్వస్తి సాగింది.
ఈ కార్యక్రమంలో వేద శాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్, సభ సభ్యులు శిష్టా భాస్కర్, కుమారశాస్త్రి, యేడిది సుబ్రహ్మణ్యం తదితరులు ఘనంగా సత్కరించారు. వేదాభిమానులు మండలీక ఆదినారాయణ, పుత్సా కృష్ణ కామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు