

బాపట్ల,జనవరి 12 : వీర గాథ 5.0 జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన కె.వెంకట రమ్య పాఠశాలకే కాకుండా బాపట్ల జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ గారు కె. వెంకట రమ్యను అభినదించారు.
బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలంలోని APRS (గర్ల్స్) వినయాశ్రమం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కె. వెంకట రమ్య జాతీయ స్థాయి వీర గాథ 5.0 (కవిత్వ విభాగం) పోటీలలో ప్రథమ బహుమతి (సూపర్–100) సాధించి జిల్లాకు గర్వకారణమని తెలిపారు.
వీర గాథ 5.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో పోటీలు నిర్వహించగా, జాతీయ స్థాయిలో మొత్తం 100 మంది విజేతలను (సూపర్–100) ఎంపిక చేశారు. అలాగే, జాతీయ స్థాయి విజేతలను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2026 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో సత్కరించనున్నారు. విజేతకు రూ.10,000/- నగదు బహుమతితో పాటు ధ్రువపత్రం అందజేయబడుతుందని.కె.వెంకట రమ్య సాధించిన సందర్భంగా పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శివబాబు, సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ బి. మోసెస్, అలాగే APRS (గర్ల్స్) వినయాశ్రమం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి పాల్గొన్నారు.
—ఏ డి, సమాచార శాఖ,బాపట్ల జిల్లా–










