

శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవాలయం దగ్గర భోగి సందర్భంగా భోగి మంట వెలిగించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.
ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ:-
తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలి. భోగిమంటల్లో ఏవిధంగా పాతదనం కాలిపోయిందో.. మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలి. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ..అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.










