
భట్టిప్రోలు:నవంబర్ 6:-ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి భట్టిప్రోలు మండలానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు ఆర్థిక సాయం మంజూరైంది. వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారి రిఫరెన్స్ లేఖ ఆధారంగా ఈ సహాయం అందుబాటులోకి వచ్చింది.మొత్తం రూ. 4,87,013/- ను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు వేమూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నక్కా ఆనంద బాబు గారు చెక్కులను అందజేశారు
భట్టిప్రోలు గ్రామానికి చెందినకట్టా రమణకు రూ. 62,038/-ముంతాజ్ బేగంకు రూ. 29,989/-కౌతరపువరప్రసాదరావుకు రూ. 15,000/-ఐలవరం గ్రామానికి చెందినమాచర్ల రవీంద్రబాబుకు రూ. 84,928/-ఈడే శివమల్లేశ్వరికి రూ. 13,350/-పల్లెకోన గ్రామానికి చెందినమచ్చ శ్రీనివాసరావుకు రూ. 18,532/-రాచూరు గ్రామానికి చెందినచిలకా ఉజ్వల్‌కు రూ. 49,883/చిలకా పండుకు రూ. 42,878/-కఠారు పల్లవికి రూ. 25,655/-అల్లాముడి గ్రామానికి చెందినకొల్లూరు వెంకట నాగ పోలేరయ్యకు రూ. 42,284/-పొట్లూరి రాజ్యలక్ష్మికి రూ. 20,000/-కన్నెగంటివారిపాలెం గ్రామానికి చెందినకన్నెగంటి లక్ష్మీకి రూ. 52,376/-వడ్లమూడి జ్వాల నరసింహారావుకు రూ. 30,100/-ఈ సందర్భంగా నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ, “అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించే ఈ సహాయం వారికి కొంత ఊరట కలిగిస్తుంది. భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా ఉంటాను” అని పేర్కొన్నారు.







