పల్నాడు జిల్లా, వినుకొండ:08-10-25:వినుకొండ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బి. ప్రభాకర్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో సేవలందించిన శోభన్ బాబు సాధారణ బదిలీలలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు (పీటీసీ) బదిలీ కాగా, ఆయన స్థానంలో ఇప్పటి వరకు వినుకొండ రూరల్ సీఐగా విధులు నిర్వహించిన ప్రభాకర్‌ను పట్టణ సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఎవరికైనా అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే తెలియజేయాలని పౌరులను కోరారు.