
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రోశయ్య కాలనీ రహదారిలో టూ టౌన్ సీఐ బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ఉదయం విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి, వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు వాహనానికి సంబంధించిన ఇతర ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వారు మరియు అతివేగంగా వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, వాహనం నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడటం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరుగుతుందని వాహనదారులను హెచ్చరించారు. ప్రజల భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.bapatla news







