chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

VETAPALEM NEWS:వేటపాలెంలో పడకేసిన పారిశుధ్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

వేటపాలెం (బాపట్ల జిల్లా): బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అదుపుతప్పింది. గ్రామంలోని చాలా వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి, దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది కనీసం 15 రోజులకో, లేక నెలకు ఒకసారో మాత్రమే వచ్చి తూతూమంత్రంగా పారిశుధ్య పనులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం చెత్తను తొలగించకపోవడంతో ఇళ్ల ముందు, ప్రధాన రహదారులపై చెత్త గుట్టలుగా పేరుకుపోయి రోగాల బారిన పడే ప్రమాదం నెలకొందిCHIRALA NEWS:పది విద్యార్థులకు శక్తి బృందం దిశానిర్దేశం.

ముఖ్యంగా పాఠశాలల సమీపంలో మరియు రద్దీగా ఉండే బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజ్ రోడ్డు, రామకృష్ణ థియేటర్ రోడ్డు, పోలేరమ్మ గుడి రోడ్డు, చుండూరు లంప రోడ్డు, యానాది కాలనీ రోడ్డు, ఎస్బీహెచ్ రోడ్డు వంటి ప్రధాన వీధుల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పారిశుధ్య లోపానికి పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. పారిశుధ్యంపై కనీస దృష్టి సారించకుండా, పంచాయతీ వ్యవస్థను అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, గ్రామంలో పారిశుధ్య పనులు నిత్యం సక్రమంగా జరిగేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker