
శ్రీకాళహస్తీ:10-11-25:-కార్తీక మాసం సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ముఖ్యంగా విదేశీయ భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఇటలీ దేశానికి చెందిన 22 మంది భక్తులు బృందంగా శ్రీ ముక్కంటి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.

ఆలయంలో రద్దీ ఉన్నప్పటికీ వారు ప్రత్యేక రాహు-కేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయంలోని వినాయక స్వామి, సుబ్రహ్మణ్యస్వామి, శని భగవాన ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ గోపురాల శిల్పకళా సౌందర్యం, పురాతన స్తంభాలపై చెక్కిన శిల్పాలు వారిని ఆకట్టుకున్నాయి. ఈ శిల్ప కాంతిని వీక్షిస్తూ వారు ఆత్మానందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పురాతన ఆలయ వైభవం చూసి మంత్రముగ్ధులయ్యారు.







