
కృష్ణాజిల్లా: గుడివాడ:19 09 25:-ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము ఆయన సతీమణి వెనిగండ్ల సుఖధ పాల్గొన్నారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ! ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్ధాలు దుష్ప్రభావాలు వివరించడం జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందని అన్నారుఎమ్మెల్యే సతీమణి సుఖద మాట్లాడుతూ! ఈ కార్యక్రమం గుడివాడలో నిర్వహించినందుకు ఎమ్మెల్యే రాము మరియు యాహు సంస్థకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు, భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర మొత్తం విస్తరించి విద్యార్థుల్లో ముఖ్యంగా మగ పిల్లల్లో డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని కృషి చేస్తామన్నారు త్వరలో డ్రగ్స్ అవగాహనపై ఒక నెంబర్ ని విడుదల చేస్తామని దాని ద్వారా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ నెంబర్ కి డయల్ చేసి సమస్య చెప్పి తగిన పరిష్కారం తెలుసుకోవచ్చని వారి వివరాలు గోపిగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాహు ప్రతినిధులు పాల్గొన్నారు







