
తెనాలి, మార్చి 05: తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం (మార్చి 06) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) బి. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ మరియు రూరల్ పరిధిలోని 11 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులు, అలాగే లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
విద్యుత్ నిలిపివేసే సమయాలు – ప్రాంతాలు:
ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు:
- రామస్వామి పేట
- స్టేషన్ రోడ్
- వినీత్ & పరమేశ్వరి కైలాస్ ఏరియా
మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 గంట వరకు:
- బాలాజీరావు పేట
- మసీదు సెంటర్
- యడ్ల లింగయ్య కాలనీ
- కట్టివరం రోడ్
- మహేంద్ర కాలనీ
మరమ్మతు పనుల దృష్ట్యా ఏర్పడే ఈ అసౌకర్యాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, శాఖా సిబ్బందికి సహకరించాలని డీఈఈ అశోక్ కుమార్ కోరారుGUNTUR NEWS







