
గుంటూరు, నవంబర్ 5:-యువతకు అత్యున్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ముందుకు సాగుతోందని వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ అన్నారు. బుధవారం ఆయన వీశాట్–2026–27 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2026–27 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ–ఎల్‌ఎల్‌బీ (హానర్స్), బీబీఏ–ఎల్‌ఎల్‌బీ (హానర్స్), బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, ఫార్మ్–డీ తదితర కోర్సులకు ప్రవేశాలు ఉండనున్నట్లు తెలిపారు.ప్రవేశ పరీక్ష షెడ్యూల్:వీశాట్ ప్రవేశ పరీక్ష మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 అని డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ కృష్ణకిషోర్ వెల్లడించారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ https://admissions.vignan.ac.in/ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు సుకోవచ్చన్నారుస్కాలర్‌షిప్ ప్రయోజనాలు:వీశాట్‌లో తొలి 50 ర్యాంకులు పొందిన వారికి 50%, 51–200 ర్యాంకుల వారికి 25%, 201–2000 ర్యాంకుల మధ్య ఉన్న వారికి 10% ఫీజు రాయితీ అందజేస్తామని తెలిపారు. అదనంగా ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కూడా స్కాలర్‌షిప్ లభిస్తుందని చెప్పారు. మొత్తం సీట్లలో 25% స్కాలర్‌షిప్ కేటగిరీ కింద కేటాయించామని పేర్కొన్నారు.హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్‌లో విభిన్న కోర్సులు:గుంటూరులోని ప్రధాన క్యాంపస్‌తో పాటు హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్‌లో బీకామ్, బీఎస్సీ (సైకాలజీ), ఎమ్మెస్సీ (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంటెక్, పీహెచ్‌డీ (సీఎస్‌ఈ, ఈసీఈ, మేనేజ్‌మెంట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, ఫార్మసీ) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని వైస్ చాన్స్‌లర్ తెలిపారు.జాతీయస్థాయి గుర్తింపులు:విజ్ఞాన్ యూనివర్సిటీకి నాక్ ఏ+ గ్రేడ్, ఎన్‌బీఏ టైర్–1 అక్రిడిటేషన్, అమెరికా అబెట్ గుర్తింపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 70వ స్థానం వంటి పలు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయని తెలిపారు.పరిశ్రమలకు అనుగుణమైన సిలబస్:యూనివర్సిటీ పాఠ్యాంశాలను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తోందని చెప్పారు. బీటెక్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ నాలెడ్జి వంటి ఆధునిక కోర్సులు ఉద్యోగ అవకాశాలపై దృష్టి:విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ప్రత్యేకంగా 200 గంటల క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (CRT) తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజ్ఞాన్ విద్యార్థులు అమెజాన్, సిస్కో, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి 65కి పైగా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు.
సివిల్స్ కోచింగ్, ఇన్నోవేటర్స్ క్లబ్:ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము మాట్లాడుతూ, బీటెక్‌తో పాటు సివిల్స్, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇన్నోవేటర్స్ క్లబ్, టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.ఫీజు రాయితీలు:డైరక్టర్ అడ్మిషన్స్ ఏ. గౌరిశంకర్ రావు మాట్లాడుతూ, గతేడాది విద్యార్థులకు రూ.48 కోట్లకు పైగా స్కాలర్‌షిప్స్ ఇచ్చామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 నుంచి 100 శాతం వరకు ఫీజు రాయితీ అందిస్తున్నామని తెలిపారు.ఫోటో క్యాప్షన్:వీశాట్ 2026–27 ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్న విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్, ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము, డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ కృష్ణకిషోర్, డైరక్టర్ అడ్మిషన్స్ మరియు డిప్యూటీ రిజిస్ట్రార్ ఏ. గౌరిశంకర్ రావు.







