Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలకు విజ్ఞాన్‌ నిరుల విద్యార్థినులు

అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలకు విజ్ఞాన్‌ నిరుల విద్యార్థినులుభవిష్యత్ సాంకేతికతలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు “అమరావతి క్వాంటమ్ వ్యాలీ”ని ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు APSCHE సంయుక్తంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్–2025 (APQH-2025) ను నిర్వహిస్తున్నాయి.
దీనిలో భాగంగా, జేఎన్టీయూకే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరులోని విజ్ఞాన్‌ నిరుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నల్ హ్యాకథాన్ పోటీలు నిర్వహించారు. మొత్తం 30 మంది విద్యార్థినులు వివిధ విభాగాల నుండి చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాధిక ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ హ్యాకథాన్ లు విద్యార్థినుల తార్కిక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా మలచుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ధైర్యంగా సృజనాత్మక సవాళ్లను స్వీకరించాలని ప్రోత్సహించారు. డీన్ ఆర్&డి డాక్టర్ వి. లక్ష్మణ్ నారాయణ కూడా ప్రసంగించి పాల్గొన్న విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు.
ఈ హ్యాకథాన్లో నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక రంగాలకు సంబంధించిన సమస్యలు ఇవ్వబడ్డాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన బృందాలు రాష్ట్ర స్థాయి APQH-2025 పోటీలకు పంపించనున్నారు.
ఈ సందర్భంగా, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాధిక విజేతలతో పాటు ఎంపికైన బృందాలను అభినందించి, రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమాన్ని SPOC డాక్టర్ సత్య సందీప్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button