
Krishna:పెడన, అక్టోబర్ 19విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా “ఆచీవర్స్ డే–2025” వేడుకలను పట్టణంలోని విజయానంద డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టాభి గ్రామీణ బ్యాంక్ శిక్షణ కేంద్రం జిల్లా డైరెక్టర్ బి. స్వర్ణశ్రీ మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడానికి తాము పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.పురుషులకు, మహిళలకు వేర్వేరు కోర్సుల ద్వారా 15 నుండి 45 రోజులపాటు తరగతులు, ప్రయోగాత్మక శిక్షణలు అందిస్తున్నామని, పూర్తయ్యాక ధ్రువపత్రాలు కూడా అందజేస్తున్నామని చెప్పారు. టాలీ వంటి కంప్యూటర్ కోర్సులకు కూడా శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అనేక మంది యువతులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నారని ఆమె వివరించారు.
ఈ సందర్భంగా మచిలీపట్నం న్యాయవాది లంకెశెట్టి బాలాజీ మాట్లాడుతూ, విద్యార్థి దశలో సమయపాలన, స్పష్టమైన లక్ష్య నిర్దేశం ఎంతో ముఖ్యం అని అన్నారు. విద్యార్థులు అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్లు ఉపయోగించి, ఎక్కువగా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.







