
Bapatla:చీరాల:02-11-25:- చీరాలపట్టణ ప్రజలకు మరొక శుభవార్త.గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్‌లో ఉన్న లైఫ్ హాస్పిటల్ ఇప్పుడు “విజయా’స్ కోస్టల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” గా రూపాంతరం చెందుతోంది.ఈ ఆస్పత్రిని రేవంత్ ఆకురాతి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
హాస్పిటల్‌లో జనరల్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, యాక్సిడెంట్స్, జనరల్ సర్జరీలు, గైనకాలజీ వంటి విభాగాలతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటి వరకు పలు వైద్య, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందామని, అదే ఉత్సాహంతో మరింత విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించాలన్నదే తమ సంకల్పమని రేవంత్ ఆకురాతి పేర్కొన్నారు.“ఇది మీ హాస్పిటల్, మీరే మేనేజ్‌మెంట్” అన్న నినాదంతో విజయా’స్ కోస్టల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అతి త్వరలో ప్రజల సేవలోకి రానుంది.







