
విజయవాడ:– గురు నానక్ కాలనీ, కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్–5లో ప్రారంభమైన “బృందావన్ తెలుగు కిచెన్” హోటల్‌ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడలో ఇప్పటివరకు ప్రజలు చూడని విధమైన సరికొత్త తెలుగు వంటకాల రుచులను అందించాలనే లక్ష్యంతో బృందావన్ తెలుగు కిచెన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
తమ హోటల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పచ్చిమిర్చి కోడి పలావ్, మష్రూమ్స్ మసాలా, ఫిష్ ప్రాన్ మసాలా, స్పెషల్ చాపల పులుసు వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే ఇంటివద్ద జరిగే చిన్న చిన్న పార్టీలకు, హాఫ్ సారీస్, పంచెల ఫంక్షన్లకు కేటరింగ్ సేవలు కూడా అందించనున్నట్లు తెలిపారు.NTR VIJAYAWADA News
ఈ కార్యక్రమంలో బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ సిబ్బంది, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.







