chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

VIJAYAWADA LOCAL NEWS:దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ఆందోళన – రోస్టర్ వెరిఫికేషన్ వేగవంతం చేయాలంటూ హెచ్చరిక

విజయవాడ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నెం.15ను 14-11-2025న విడుదల చేసి, మార్చి 31ను తుది గడువుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నెలలు గడుస్తున్నా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడం పట్ల దివ్యాంగుల వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అర్హులైన దివ్యాంగుల కోసం మూడు సంవత్సరాల తరువాత బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్‌కు ఆదేశాలు వచ్చినప్పటికీ, రోస్టర్ వెరిఫికేషన్ సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతోందని దివ్యాంగులు వాపోతున్నారు.

వయస్సు పరిమితి దాటిపోతున్న అభ్యర్థులు ఇప్పటికే అవకాశాలు కోల్పోతూ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితిలో అధికారుల ఆలస్యం మరింత ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.Vijayawada Localnews

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న కృష్ణా జిల్లాలో సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి రోస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విజయవాడలో దివ్యాంగుల మహోద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker