Bapatla news:రహదారి భద్రత విషయంలో జాగ్రత్త
రహదారి భద్రతా మసోత్సవాల ముగింపు సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలను జిల్లా కలెక్టర్ శ్రీ జె. వెంకట మురళి అభినందించారు. స్థానిక బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు రవాణా శాఖ వారు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు సర్టికేట్స్ తో పాటు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. యుక్త వయస్సులో నిబంధనలను తెలియచెయ్యడం వలన అవి వారి మెదడుపై బలంగా ప్రభావం చూపుతాయని భవిష్యత్తులో వారు ప్రమాదాల భారిన పడకుండా కాపాడటంతో పాటుగా వారు మిగిలిన వారిని కూడా చైతన్యవంతులను చెయ్యగలుగుతారన్నారు. పిల్లలకు అర్హత కలిగిన వయస్సు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ పొందేవరకు వాహనాలు నడువుటకు అనుమతిని ఇవ్వవద్దని తల్లితండ్రులను ఈ సందర్భంగా ఆయన కోరారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ టి.కె. పరంధామ రెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహించిన ఈ వ్యాసరచన పోటీల్లో పి.శ్రీవల్లి(8 వ తరగతి) మొదటి బహుమతి, జె.షణ్ముఖ ప్రియ(9 వ తరగతి) రెండవ బహుమతి, టి. సన్నిధి(6 వ తరగతి) మూడవ బహుమతి మరియు ఎన్. మాధురి(7 వ తరగతి),పి.వర్షిక(5 వ తరగతి) లు కన్సోలేషన్ బహుమతులు పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్. ప్రసన్న కుమారి, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పి. అంకమ్మరావు, రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్, బి. ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు జి.హేమలత మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ———- డిస