ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ:08-10-25:విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1న విజయలక్ష్మి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా, పోలీస్ దర్యాప్తుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ADCP గుణ్ణం రామకృష్ణ మాట్లాడుతూ:
“విజయలక్ష్మిని చివరిసారిగా విజయవాడ సాయిరాం సెంటర్ వద్ద మైనర్ బాలుడితో కనిపించింది. ఆ బాలుడు ఆమె మనువడు వరుసకు. బైక్‌పై ఆమెను తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది,” అని పేర్కొన్నారు.
విజయలక్ష్మి హత్యకు సుబ్రమణ్యం అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. సుబ్రమణ్యం భార్యతో ఓ ఆటో డ్రైవర్‌కు ఉన్న అనైతిక సంబంధానికి విజయలక్ష్మి మద్దతుగా ఉండటంతో, ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
వధకు కొడుకుతో సహకారం:
హత్యను సుబ్రమణ్యం తన మైనర్ కొడుకుతో కలిసి అమలు చేశాడు. హెబి కాలనీ ప్రాంతంలో విజయలక్ష్మిని హత్య చేసిన అనంతరం, శవం ఆనవాళ్లు మిగలకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేశారు.
టెక్నాలజీ సహాయంతో అరెస్టు:
పోలీసులు 7,000 సీసీ కెమెరాల ఫుటేజీ జల్లెడపట్టి నిందితుడిని గుర్తించారు. చివరకు సుబ్రమణ్యాన్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలుడు కూడా విచారణలో ఉన్నాడు.