
10వ తరగతి ఫలితాలలో గుంటూరు వికాస్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈమేరకు
590 పైన ఏడుగురు విద్యార్థులు సాధించారు. అదేవిధంగా 580 పైగా 12 మంది, 570 పైగా 29 మంది, 560 పైగా 38మంది, 550పైన 49 మంది విద్యార్థులు సాధించారు. 10వ తరగతిలో
మొత్తం 91 మంది పరీక్షకు హాజరు కాగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను
వికాస్ స్కూల్
డైరెక్టర్ దండా పవన్ మీడియాకు వెల్లడించారు.







