chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

VISHAKAPATNAM NEWS :వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం, మార్చి 23: పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులను అధికారులు అత్యంత వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువులోగా సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరటనివ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా డీఎంహెచ్ఓ, అటవీ శాఖలు తమ పరిధిలోని పెండింగ్ అంశాలను తక్షణమే క్లియర్ చేయాలని, పద్మనాభం మండల ఎంఆర్ఓ పరిధిలోని సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ విభాగం, పంచాయతీరాజ్, హౌసింగ్, రెవెన్యూ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

VISHAKAPATNAM NEWS :వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కలెక్టర్ కఠినంగా వ్యవహరించారు. 21 రోజులు గడువు దాటినా ఫిర్యాదును పరిష్కరించని ఆనందపురం మండల సర్వేయర్‌కు నోటీసు జారీ చేయాలని, పదేపదే తప్పిదాలు చేసే అధికారులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్య మూలాలను తెలుసుకోవాలని సూచించారు.

VISHAKAPATNAM NEWS :వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

253 వినతుల నమోదు: ఈ సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 253 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 96, రెవెన్యూ శాఖకు 91, పోలీస్ శాఖకు 13, ఇతర శాఖలకు 53 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్ఛార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణి తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవోలు, తహశీల్దార్లు వినతులను స్వీకరించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు.http://VISHAKAPATNAM NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker