
అమరావతి: నవంబర్ 10:-రాష్ట్రంలోని వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు.

రిజిస్ట్రేషన్లు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, రేషన్ పంపిణీ, దీపం–2.0 అమలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. వివిధ జిల్లాల్లో ఈ కార్యక్రమాల అమలు స్థితిగతులను జిల్లా వారీగా పరిశీలించారు. కార్యక్రమాల ప్రభావం ప్రజల దాకా ఎలా చేరుతోందన్న దానిపై సీఎం ఆరా తీశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ఫలితాలు మెరుగుపరచాలని సూచించారు.







