chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంతో పరిశ్రమల అభివృద్ధి విధానాన్ని ప్రభుత్వం చేపట్టింది-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల: డిసెంబర్‌ 19:-ఒక కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ వి. అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది.

Bapatla Local News :ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంతో పరిశ్రమల అభివృద్ధి విధానాన్ని ప్రభుత్వం చేపట్టింది-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఔత్సాహికులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టిందన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానంలో సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌కు 5,110 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో వివిధ శాఖల ద్వారా 4,931 దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన 179 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై ఆరా తీశారు. ఈ విధానంపై నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల అభివృద్ధి విధానంలో భాగంగా వివిధ రాయితీల కోసం 238 దరఖాస్తులు అందాయని తెలిపారు. పెట్టుబడి రాయితీ, వాణిజ్య పన్నుల రాయితీ, విద్యుత్‌ రాయితీ, వడ్డీ తిరిగి చెల్లింపు వంటి అంశాలపై జిల్లా కమిటీ పరిశీలన చేపట్టి 235 యూనిట్లకు రూ.9.34 కోట్లను రాయితీగా మంజూరు చేయాలని తీర్మానించి ఆమోదించిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనను వేగంగా ప్రజల వరకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.TODAY BAPATLA NEWS

అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల మేరకు బాపట్ల జిల్లాలో రెండు భారీ పరిశ్రమలు స్థాపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గాజు ఉత్పత్తి పరిశ్రమతో పాటు సౌర విద్యుత్‌ పలకల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని, వీటి వల్ల జిల్లాకు రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులను సూచించారు.

బాపట్ల జిల్లా పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చెందనున్నట్లు పేర్కొన్న కలెక్టర్‌, ఇందుకోసం ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 84 కిలోమీటర్ల తీర ప్రాంత అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామని, ఈ ప్రణాళికను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ వై. రామకృష్ణ, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ శివకృష్ణ, జిల్లాస్థాయి కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)
Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Product
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Product
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker