
విశాఖపట్నం:14-11-25:-విశాఖచేరుకున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప రాష్ట్రపతిని ఆహ్వానించారు.
ఉదయం విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి, కాసేపట్లో ఏయూ ప్రాంగణంలోని వేదికకు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ను ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడులపై కీలకంగా చర్చలు జరగనున్నాయి.







