Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

VVIT ఘనంగా వివిఐటి The స్నాతకోత్సవం

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాల స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈస్నాతకోత్సవ వేడుకలలో క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకము, ప్రశంసా పత్రాలతోపాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రధానం చేసారు. ఈ వేడుకలో భారతీయ సంస్కృతిని ప్రతిభంబించేలా విద్యార్థులు సాంస్కృతిక వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ॥ కె. మధుమూర్తి, వివిఐటి విశ్వవిద్యాలయ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వివిఐటియూ వైస్స్ చాన్స్ లర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపాల్ డా॥ వై. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భముగా 2021-2025 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరచి కళాశాల టాపర్ గా నిలచిన విద్యార్థిని పరుచూరి బిందు రేణుకకు వాసిరెడ్డి వెంకటాద్రి బంగారు పతకాని ముఖ్యఅతిధి ప్రా|| కె. మధుమూర్తి అందచేసారు.

ముఖ్యఅతిధి ప్రా|| కె. మధుమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక ఎంతోమంది

VVIT ఘనంగా వివిఐటి The స్నాతకోత్సవం

విద్యార్థుల తల్లిదండ్రుల త్యాగాలు ఉంటాయని అన్నారు. డిగ్రీ అంటే కేవలం పట్టా మాత్రమే కాదు జ్ఞానాన్ని సంపాదించటం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటి, హెల్త్కేర్, ఆక్వా రంగాలలో అనేక అవకాశాలను కల్పిస్తుందని స్టార్టప్ కంపెనీలను స్థాపించి ఉద్యోగ నియమకాలను అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. విజన్ 2047లో యువత ముఖ్య భూమికని వారివారి రంగాలలో రాణించి రాష్ట్ర దేశ ప్రగతికి తోడ్పడాలని అన్నారు. నిజమైన అకడమిక్ జర్నీ నేటి నుండి మొదలైనదని ప్రొఫెషనల్ గా, పర్సనల్గా తమని తాము మలుచుకోవాలని సూచించారు.

వివిఐటి విశ్వవిద్యాలయ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ ప్రపంచంలోనికి అడిగిడుతున్నారని ఎదురయ్యే సవాళ్ళను అదిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజానికి తమవంతు సహాయం అందించాలని తల్లిదండ్రులకు, మాతృభూమికి మంచి చేయాలని సూచించారు.

వివిఐటియూ వైస్ చాన్స్లర్ కొడాలి రాంబాబు మాట్లాడుతూ, 2007లో ప్రారంభమైన వివిఐటి కళాశాల

అనతికాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకొని 2025లో విశ్వవిద్యాలయంగా ఎదిగిందని తెలిపారు. వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంపూర్ణ విద్యను, క్రమశిక్షణను అందిస్తున్నదని పరిపూర్ణవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు.

అనంతరం వివిఐటి ప్రిన్సిపల్ డా॥ వై. మల్లిఖార్జునరెడ్డి కళాశాల వార్షిక ప్రణాళికను భవిష్యత్తు కార్యాచరణను

ఈవేడుకలో ప్రకటించారు.

ఈకార్యక్రమములో వివిఐటి వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరి ఎస్. బదరి ప్రసాద్, జాయింట్ సెక్రటరి మామాళ్ళపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ డా॥ కె. గిరిబాబు, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు

పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button