Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

VVIT College is now VVIT University:వివిఐటి కళాశాల ఇకపై వివిఐటి విశ్వవిద్యాలయం

VVIT College is now VVIT University

వివిఐటి కళాశాల, వివిఐటి విశ్వవిద్యాలయం (వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నో లాజికల్ యూనివర్శిటి)గా రూపాంతరం చెందిందని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లుగా వివిఐటి విద్యాసంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” ప్రకటనకు తగ్గట్టు కేవలం రెండు నెలల వ్యవధిలో ప్రభుత్వం వివిఐటి అభ్యర్ధనను పరిశీలించి యూనివర్శిటి హెూదాను కల్పించినదని అందుకుగాను ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాలు క్రితం ఆప్టెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభమైన విద్యాసంస్థలు యూనివర్శిటీ స్థాయికి ఎదగటం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో భాగం కావడం సంతోషాన్ని అందించిందని పేర్కొన్నారు

https://youtube.com/live/MX-OQF7GGZ0?feature=share. ఈసందర్భముగా వివిఐటి విశ్వవిద్యాలయం ప్రాంగణములో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశములో ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, సెక్రటరి సూర్యదేవర బదరి ప్రసాద్, జూయింట్ సెక్రటరి మామిళ్ళపల్లి శ్రీకృష్ణతో కలసి విశ్వవిద్యాలయం లోగో, బ్రోచర్లను విడుదల చేసారు. ఈవిద్యా సంవత్సరం నుండి విశ్వవిద్యాలయంలో అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రారంభించి మేనేజ్ మెంట్ స్టడీస్ (ఎమ్.బి.ఎ. బి.బి.ఎ)లను అందించనున్నట్లు వివరించారు.

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని నినాదంతో వివిఐటి సంస్థలను ఏర్పాటుచేయటం జరిగిందని, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులకు ఉత్తమ క్రమశిక్షణతో, విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందించడం మాలక్ష్యం అని ఆయన తెలిపారు. కళాశాల ఉన్నతిలో, ప్రణాళికలలో, కార్యక్రమాలలో విద్యార్థులు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాలను సాధించామని అన్నారు. ప్రతిభగల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందిస్తామన్న హామి ఇచ్చారు. అడ్మిషన్స్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వివిఐటి యూనివర్శిటీలో విద్యార్థులు ప్రవేశం పొందేందుకు ప్రవేశ పరీక్ష వ్రాయవలసి ఉంటుందని ఏప్రియల్ 24వ తారీఖున ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఫలితాల ప్రామాణికంగా ప్రవేశాలు, స్కాలరషిప్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ డా॥ వై. మల్లిఖార్జునరెడ్డి. విభాగాదిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button