
బంగాళాఖాతంలో మంతా తుఫాన్ ప్రభావంతో అలలు ఉధృతం
చిన్నగంజాం, బాపట్ల జిల్లా (రిపోర్టర్ ఎస్. భాస్కర్ రావు):
బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో అలలు ఉధృతంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు ఎవ్వరూ వెళ్లరాదని చిన్నగంజాం ఎస్సై ఎస్. రమేష్ ప్రజలకు సూచించారు. Chinaganjam:పుట్టల్లో పాలు పోసి పూజలు చేసిన మహిళలు
తీరప్రాంత గ్రామాల ప్రజలు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సముద్ర తీరాలకు వెళ్లి స్నానం చేయకూడదని ఆయన హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావం కొనసాగుతున్నందున ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రమేష్ విజ్ఞప్తి చేశారు.






