
గుంటూరు, నవంబర్ 7:-రెండు రోజుల పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం స్వయంగా పరిశీలించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 11వ తేదీన మహోత్సవం జరగనుంది.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వాటర్ షెడ్ – పీఎంకేఎస్‌వై జాతీయ సదస్సు (వాటర్ షెడ్ మహోత్సవ్) నవంబర్ 10, 11 తేదీలలో గుంటూరు జిల్లాలో జరుగనుంది.
మొదటి రోజు గుంటూరు ఐటిసి హోటల్‌లో ప్రారంభ కార్యక్రమం జరగగా, రెండవ రోజు ప్రధాన సమావేశం వెంగళాయపాలెంలో నిర్వహించనున్నారు.ఈ మహోత్సవానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్స్ సహాయమంత్రి డా. చంద్రశేఖర్ పెమ్మసాని, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 130 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం వెంగళాయపాలెం గ్రామానికి చేరుకుని ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పరిషత్ సీఈఓ వి.జ్యోతి బసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తహసిల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నా







