chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్తెలంగాణవాతావరణం

WEATHER REPOT.:తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు భారీగా చలిగాలులు….

వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. రెండు రోజుల పాటు ( జనవరి 21,22) ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

శ్రీలంకకు దిగువన అల్పపీడనం ఏర్పడింది . దీని ప్రభావంతో తమిళనాడువైపు బలమైన గాలులు వీస్తుండటంతో.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వర్షం పడకపోయినా.. చలి విపరీతంగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..వీలైనంత వరకు రాత్రిళ్లు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సూచించారు. శాటిలైట్ అంచనాల ప్రకారం రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోమేఘాలు చాలా తక్కువగా ఉంటాయి. జనవరి 21, 22 తేదీలు పొడి వాతావరణం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరుగుతుంది. ఏపీ కంటే తెలంగాణలో చలి మరింత ఎక్కువగా ఉంటుంది.

రానున్న రోజుల్లో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏజెన్సీ, అడవి ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. పగటివేళ కంటే రాత్రివేళ తేమ బాగా పెరుగుతుందని..రాత్రిళ్లు చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తెలిపింది. చలి తీవ్రత కారణంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పిల్లలు, ముసలివారు, ఆస్తమా బాధితులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 30కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో ఇది గంటకు 14కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం గాలులన్నీ శ్రీలంకవైపే వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో చలి వాతావరణం రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నందున, ముఖ్యంగా హాని కలిగించే జనాభాకు ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker