ఏలూరు నగరంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా వెస్ట్ గోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని బ్యాంకుల నాయకులు సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెలో భారీ ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ కామ్రేడ్ శ్రీనివాస్ మోహన్, ఏలూరు రీజియన్ రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ లక్ష్మణరావు నాయకత్వంలో ఆర్ఆర్ పేటలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద 200 మందికి పైగా బ్యాంకు సిబ్బందితో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపుమేరకు ఈరోజు ఏలూరు నగరంలో సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నమన్నారు. బ్యాంకులను ప్రైవేటీకరణ మానుకోవాలని అదేవిధంగా బ్యాంకు ఎంప్లాయిస్ ల విషయంలో అవుట్సోర్సింగ్ విధానంలో గాని, కాంట్రాక్టింగ్ విధానంలో గాని ఉద్యోగులుగా చేర్చుకోరాదని అలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. అంతేకాకుండా బ్యాంకు డిపాజిట్ ధరలకు పింఛన్ చార్జింగ్ తగ్గించాలని, బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని విదేశాలకు పారిపోయిన పెద్దల నుంచి ఆ డబ్బులు రికవరీ చేసి బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారికి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.
241 1 minute read