భాగస్వామి లేకుండా జీవించలేక.. 24 గంటలు పక్కనే ఉండి చనిపోయిన పాము.
Snake Dies Beside Its Dead Partner After 24 Hours | Heart Touching Incident in MP
Snake Dies Beside Its Dead Partner After 24 Hours | Heart Touching Incident in MP
పాములపై అందరికీ భయం ఉంటుంది. కానీ పాములకూ ప్రేమ, అనురాగం ఉంటుందనడానికి ఉదాహరణగా నిలిచిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లా ధుర్కుడా కాలనీలో చోటు చేసుకుంది.
ఇక్కడ ఒక పాముజంట ప్రేమ కథ ఊరంతా కన్నీరు పెట్టించింది.
ఏం జరిగింది?
గురువారం పహడ్గఢ్ పంచాయతీ పరిధిలోని రహదారిపై ఒక మగ పాము రోడ్డును దాటుతుండగా ఒక వాహనం దాని పైకి వెళ్లిపోవడంతో తక్షణమే చనిపోయింది.
అది చూసిన గ్రామస్తులు దాని శవాన్ని రోడ్డుకు పక్కన పెట్టారు.
కొద్ది సేపటికి అక్కడకు ఆడ పాము వచ్చింది. దాని ప్రాణసఖుడిని మృతదేహంగా చూసి షాక్‌కు లోనయింది. తన జతను వదిలి వెళ్లలేక 24 గంటల పాటు పక్కనే ఉండిపోయింది.
పాము చేసిన ప్రయత్నం..
గ్రామస్థుల మాటల్లో:
“ఆ ఆడ పాము.. తన మగ సర్పాన్ని కదిలించేందుకు ప్రయత్నించింది.
తను ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా చూశాము.
కన్నీళ్ళు పెట్టుకున్నాము.”
తన భాగస్వామి లేడు అని తెలుసుకున్న ఆడ పాము చివరకు తాను కూడా అక్కడే శ్వాస విడిచింది.
గ్రామంలో భావోద్వేగం
ఈ ఘటన చూసిన గ్రామస్థులందరూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఒక సర్పానికి భాగస్వామిపై ఇంత ప్రేమ ఉంటుందా అని ఆశ్చర్యపోయారు.
పాముల జంటకి సంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించారు.
తర్వాత గ్రామస్తులు ఆ ప్రదేశంలో ఒక వేదిక నిర్మించి, ఈ ప్రేమకు గుర్తుగా నిలిపేలా ప్లాన్ చేశారు.
“ఇది ప్రేమకి, అనుబంధానికి నిలువెత్తు గుర్తుగా ఉండాలి” అని గ్రామస్థులు చెప్పారు.