

Yagna Hospitalయజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రోజున నిర్వహించిన 28వ ఉచిత మెగా వైద్య శిబిరంకు ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు యజ్ఞహాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వైద్య శిబిరం పెద్దగోళ్ళపాలెం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజల కోసం ఏర్పాటు చేయగా, 200 మందికి పైగా రోగులు హాజరై వివిధ విభాగాలకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ శిబిరంలో పాల్గొన్న రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచన మేరకు ఉచిత మందులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వంలోని ఆరోగ్య భీమా పథకాల వివరాలను కూడా తెలియజేశామని చెప్పారు.
ఈ వైద్య శిబిరంలో
డా. యజ్ఞ శ్రీకాంత్ గారు, డా. మాధవి బెల్లంకొండ గారు, డా. టీ. పవన్ కుమార్ గారు, డా. ఉపేంద్ర చౌదరి గారు
వైద్య సేవలు అందించి ప్రజలకు చికిత్సలు చేశారని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహిస్తామని యజ్ఞ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.







