

ఏళ్ల తరబడి నివేశన స్థలాలకు నోచుకోని ఎస్టీలు … సిఐటియు నాయకులు కె.శరత్….అనాదిగా నివేషణ స్థలానికి నోచుకోని యానాదులకు వెంటనే శాశ్వత నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు పట్టణ నాయకుడు కె. శరత్ ఆధ్వర్యంలో సూర్యలంక తీరం వెంట నివాసాలు ఉంటున్న యానాదులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు శరత్ మాట్లాడుతూ బాపట్ల మండలం అడవి పంచాయితీ పరిధిలో సూర్యలంక తీర ప్రాంతంలో సుమారు వందేళ్ళ నుండి తాత ముత్తాతల కాలం నుండి సముద్ర జలాలను నమ్ముకుని వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు శాశ్వత నివేశన స్థలాలు లేవు. 20 కుటుంబాలు ఉపాధిలేక కొందరు పాచి పనులు, బిక్షాటన, బీచ్ లో వ్యర్థాలను ఏరుకుంటూ వాటిని అమ్మి వాటితో జీవనం సాగిస్తున్నారు. నేటికి నివాస స్థలాలు లేక సరైన ఇళ్ళు లేక తీరప్రాంతంలో చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటుచేసుకొని ఎండకి ఎండుతూ, వానికి తడుస్తూ పిల్లలు, వృద్ధులు ఇక్కడే కాల గడుపుతున్నారు. బాపట్ల తహసిల్దార్ వీరి సమస్యలపై స్పందించిన బాపట్ల తహసిల్దార్ షేక్ సలీమా వీరు నివాసాలు ఉంటున్న ప్రదేశానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. అందరికీ ఈ ప్రాంతంలోనే నివేశ స్థలాలు ఇస్తామని ఇప్పుడు నివాసాలు అంటున్న స్థలాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అనేక పర్యాయాలు ఈ సమస్యపై మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆర్జీల ద్వారా విన్నవించుకున్నప్పటికి వీరి సమస్య సమస్య సమస్యగానే ఉఃదన్నారు. పర్యాటకం పేరుతో ఇప్పటికే ఉన్నచోట నుండి అధికారులు దౌర్జన్యంగా నాలుగుచోట్లకు మార్చారు. ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రదేశాన్ని కూడా పర్యాటక అభివృద్ధికి 25 ఎకరాలు ఇచ్చామంటూ తక్షణమే ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జీవనోపాధి దృష్ట్యా జీవనోపాధి దృష్ట్యా అక్కడే నివేశన స్థలాలు ఇచ్చి పక్కాగృహాలు నిర్మించాలని కోరూతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నట్లు శరత్ చెప్పారు. కార్యక్రమంలో శీను, నాగరాజు,కోటయ్య,మేరీ, ఏసమ్మ, చామంతమ్మ పాల్గొన్నారు.







