
యద్దనపూడి, అక్టోబర్ 12:పర్చూరు నియోజకవర్గంలో ప్రజాసేవను ప్రధేయంగా తీసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం యద్దనపూడి జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

ఈ శిబిరాన్ని ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రిటెక్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించగా, గుంటూరులోని శంకర కంటి వైద్యశాల నిపుణులు వైద్య సేవలు అందించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ శిబిరంలో మొత్తం 505 మంది ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 215 మందిని శస్త్రచికిత్సకు రిఫర్ చేయడం జరిగింది
వైద్య శిబిరంలో కేవలం కంటి పరీక్షలకే కాకుండా, బీపీ, షుగర్, ఈసీజీ, రక్తపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారిని వైద్య నిపుణులు గుర్తించి, అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించే ఏర్పాట్లను ట్రస్ట్ తరఫున చేపట్టినట్టు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా, కార్యక్రమానికి హాజరైన వైద్యులు ప్రజలను ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అన్నదాన ఏర్పాట్లు చేసి ఆతిథ్యాన్ని కల్పించారు.శిబిరం ప్రారంభానికి ముందు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి మరియు ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో టిడిపి నాయకులు నల్లపునేని రంగయ్య చౌదరి, రావిపాటి సీతయ్యలు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.ప్రతి నెలా నియోజకవర్గం అంతటా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి లక్ష మందికి సేవలు అందించడమే లక్ష్యంగా మిషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే ఏలూరి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో కనపర్తి నాగేశ్వరరావు, తారక రామారావు, ధూళిపాల వెంకటస్వామి, నేహామయ్య రావు, సాంబయ్య, గోరంట్ల సాంబయ్య, వెంకటేశ్వర్లు, కనకరాజు, వాసు, అనిల్, సర్పంచ్ రేణుక బాల కోటేశ్వరరావు, కారుమంచి కృష్ణ, సుబ్బయ్య, సుధీర్, హరి ప్రసాద్, బాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










