
నవంబర్ 8:-ఏలూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో శనివారం ఏలూరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఏలూరు చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్ లిమిటెడ్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు.ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే ఏలూరి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం, ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించా
అనంతరం శిబిరాన్ని ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలను అందజేశారు.శిబిరంలో మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బీపీ, షుగర్, రక్తపరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 300 మంది పరీక్షలు చేయించుకోగా, వారిలో 120 మందిని శస్త్ర చికిత్సలకు వైద్యులు రిఫర్ చేశారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం గ్రామస్తులకు నాణ్యమైన సేవలు అందించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు –
“అధికారానికి సంబంధం లేకుండా గత 14 ఏళ్లుగా ఉచిత కంటి వైద్య శిబిరాలను యజ్ఞంలా కొనసాగిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా పేదలకు సేవ చేయడమే నా ధ్యేయం. ఈ కార్యక్రమాల ద్వారా లక్షలాది రూపాయలు ప్రజలు ఆదా చేస్తున్నారు. ఎవరైనా రాకపోతే మేమే వెళ్ళి సేవ చేయడం మా విధి,” అని తెలిపారు.తాజాగా శంకర కంటి ఆసుపత్రిలో కొత్త బ్లాకు ఏర్పాటు చేసి, రోజుకు 300 మంది వరకు శస్త్ర చికిత్సలు నిర్వహించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన చికిత్స అందించడమే లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, నాయకులు ఆదినారాయణ, రంగయ్య, తాటి నాగేశ్వరరావు, తిరుమలశెట్టి శ్రీహరి, శంషుద్దీన్, జనార్ధన్, రజాక్, ఫారుక్, సీతయ్య, తారక రామారావు, సాంబయ్య, సురేష్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.







