chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri Local News:యర్రబాలెంలోని శ్రీకృష్ణుడి ఆలయం పునః నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ రూ.5 లక్షలు విరాళం

మంగళగిరి:09-11-25:- మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని యాదవపాలెంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆలయం పునః నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ విరాళం అందించారు. ఆదివారం మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం ఆలయం పునః నిర్మాణానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ కు యర్రబాలెం గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా , మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, శ్రీకృష్ణుడు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి నారా లోకేష్‌కు ఉండాలని కోరారు. భవిష్యత్‌ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా ఆలయంకు విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీ కృష్ణుడు ఆలయం పున:నిర్మాణంలో ప్రజలు, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో పాత్రులు కావాలని కోరారు. శ్రీకృష్ణుడి ఆలయం పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చావలి ఉల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు నీలం అంకరావు, ఆకుల పానకాల రావు, గడదాసు రంగారావు,ఆర్థల పిచ్చయ్య, కర్నాటి సత్యనారాయణ, తోట శ్రీను, తోట సురేష్, మిర్యాల సత్యనారాయణ, యలమంచిలి పద్మజ, అప్పల శాంతి, దానబోయిన శివశంకరరావు, రుద్రు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker