
ఢిల్లీ: ఎర్రకోట:-10-11-25:ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి కలకలం రేగింది. సాయంత్రం సుమారు 6:45 గంటల సమయంలో గేట్ నెంబర్-1 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించిందిపేలుడు ధాటికి అక్కడ పార్క్ చేసిన ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 10కి పైగా వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దారుణ ఘటనలో తొలికాణాకాల ప్రకారం 9 మంది మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఘటన స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్, బాంబ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు భారీగా చేరుకుని పరిసరాలను ఖాళీ చేయించారు.మంటలను అదుపు చేసేందుకు ఏకంగా ఏడు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణాలు తెలియరావలసి ఉందని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.







