రాష్ట్రంలో ఏడాదికిపైగా టీడీపీ కూటమి సర్కారు సాగిస్తున్న రెడ్ బుక్ అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వైఎస్సార్సీపీ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసిన వైఎస్సార్ సీపీ బృందం ఈ అరాచకాలపై జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది.రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ కు వివరించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలం కావడం, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీసిందని.. ప్రతి ఘటననూ వక్రీకరిస్తూ తమపై ఎదురుదాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచ్చింది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నివేదించిం
2,242 Less than a minute