
గుంటూరు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను గుంటూరు నగరంలోని 2వ వార్డు, ఇసాయాలపేట మసీదు సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. ysjagan:రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు: Best wishes on the occasion of Bhogi festival to all the people of the state
ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి, అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ అధినేత జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో NVR, KR ఆధ్వర్యంలో 2వ వార్డు అధ్యక్షుడు శివన్నారాయణతో పాటు పల్ల శ్రీను, రామ్ ప్రసాద్, సాల్మన్ రాజు, రాజా బాబు, మస్తాన్, గురునాధం, పూర్ణయ్య, దానియేలు, మల్లికార్జున, అవినాష్, డీకే, సాగర్, లాబాను, కేశవ, కిరణ్, ప్రతాప్, భాను, దశగిరి, రహంతుల్ల, ఆదాము, నరేష్, వెంకట రమణ, నాగమల్లి రెడ్డి, కాంతమ్మ, రావణమ్మ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా, సేవా భావంతో కొనసాగాయి.








