నరసరావుపేట ను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవడం మన బాధ్యత… ఎమ్మెల్యే డాక్టర్ చదలబడారని బాబు..
నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్లో భాగంగా మంగళవారం నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. గత ఐదేళ్లలో స్టేడియం నిర్లక్ష్యానికి గురైందని ఆయన అన్నారు. ప్రతి రోజూ 2 వేల మంది వాకర్స్ స్టేడియానికి వస్తుంటారన్నారు. వాకర్స్, క్రీడా కారుల అభ్యర్ధన మేరకు వాకింగ్ ట్రాక్ను క్లీన్ చేసి, పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో మన టిడిపి నాయకులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.