
అనంతపురం: నవంబర్ 09:-అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా అనంతపురం – కృష్ణా జిల్లాల మధ్య నిర్వహించిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది.ఈ మ్యాచ్‌ను రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత తిలకించారు.

అలాగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్, స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అమరావతి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, ఆర్డీటీ డైరెక్టర్ మాంచు ఫెర్రర్ తదితరులు పాల్గొన్నారు.క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సౌహార్ద వాతావరణం పెంపొందుతుందని మంత్రివర్యులు పేర్కొన్నారు. క్రీడాస్ఫూర్తి, జట్టు సమన్వయం, ఆరోగ్య పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.







