chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

BREAKING NEWS – GUNTUR BRIDGE CONSTRUCTION: వేగవంతంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

GUNTUR BRIDGE UPDATE

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, నిర్మాణ పనుల వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అరండల్ పేట, బ్రాడిపేటల్లో రోడ్ల మీద ఆక్రమణలను యుద్దప్రాతిపదిన తొలగించడానికి, ఆయా ప్రాంతాల్లో రోడ్ల మరమత్తులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అరండల్ పేట 1వ లైన్, బ్రాడీపేట 1, 4వ లైన్ లు, లాడ్జి సెంటర్ నుండి బ్రాడిపేట వైపుగా కంకరగుంట ఆర్యుబికి వచ్చే మార్గం, డొంక రోడ్ తదితర ప్రాంతాల్లో జిఎంసి పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణ పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున, రోడ్ల ఆక్రమణల తొలగింపు, రోడ్ల మరమత్తులను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా డొంక రోడ్, బ్రాడిపేట, అరండల్ పేటల్లోని రోడ్లు ఆక్రమణలతో, పలు భవనాలు రోడ్ మీదకు ర్యాంప్ ల ఏర్పాటుతో కుచించుకుపోయాయని, పట్టణ ప్రణాళిక అధికారులు యుద్దప్రాతిపదికన తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలు తొలగింపు వెంటనే రోడ్ మరమత్తులు పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, కమర్షియల్ సంస్థలు, టిఫిన్ బండ్లు వారు రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్ధాలు వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా డంపింగ్ పాయింట్స్ లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించడంపై ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ లు దృష్టి సారించాలన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker