
వెంకటాచలం (నెల్లూరు జిల్లా), అక్టోబర్ 10:జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.14 గంటలకు సీఎం నందగోకులం హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. ఆయనను ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడు కీలక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇవి – నందగోకులం లైఫ్ స్కూల్, నంది పవర్ బుల్ ప్రాజెక్టు, విశ్వసముద్ర బయో ఎనర్జీ ఈథనాల్ ప్రాజెక్టు.
సీఎం పర్యటనలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, ప్రాంత శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, దగుమాటి కృష్ణారెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
విజయవాడకు సీఎం తిరుగు ప్రయాణం
ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం 4.53 గంటలకు సీఎం చంద్రబాబు నందగోకులం హెలీప్యాడ్ చేరుకొని అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడకు బయలుదేరారు. సీఎం పర్యటన ముగింపు సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.










