
విజయవాడ, గాంధీనగర్:12-10-25:-ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో సమితి ఛైర్మన్ కె. షాలేమ్ కృపా వెస్లీ, గౌరవ ఛైర్మన్ వలమాల శ్రీనివాస రావు, అసోసియేట్ ఛైర్మన్ తోటకూర కోటేశ్వర రావు, సెక్రటరీ జనరల్ జి. రాజ్యలక్ష్మి, కన్వీనర్ కె. ప్రభాకర్ రావు, అసోసియేట్ కన్వీనర్ చాట్ల సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుడి నాగరాజు, కో-చైర్మన్ చి. అన్నపూర్ణాచారి, సత్యనారాయణలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ”ఈ నెలలో పింఛన్ పంపిణీ ఉదయం 10 గంటల తర్వాత చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నాం. ఇది సచివాలయ ఉద్యోగుల సేవలను అవమానించే విధంగా ఉంది. గౌరవ గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్ సముచిత ఆదేశాలు ఇచ్చే విధంగా సంబంధిత కలెక్టర్లను ప్రభావితం చేయడం సరైనది కాదు” అని అన్నారు.ఇది కాకుండా, గ్రామీణ స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సమితి సూచించింది.ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. సమితి భవిష్యత్ కార్యాచరణపై చర్చించగా, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఇకపై సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా ముందడుగు వేయాలని నిర్ణయించిన “ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి” ఆధ్వర్యంలో కొత్త కమిటీని కూడా ప్రకటించారు.







