
బాపట్ల : కారంచేడు:12-10-25:- గ్రామంలో హజరత్ మెహబూబె సుభాని వారి గ్యార్మి షరీఫ్ వేడుకలు శనివారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఫిదా అనే పిరానె పీర్ రోషన్ జమీర్ ఖందిలె నూరానీ స్మారకంగా జరిగిన ఈ ఉత్సవాలు గ్రామం అంతటా ఉత్సాహాన్నిచేపట్టించాయి.BAPATLA NEWS: తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి
వేడుకలు బ్యాండ్ వాయిద్యాలు, విద్యుత్ దీపాల అలంకరణ, బాణాసంచాలతో జ్ఞాపకంగా నిలిచిపోయేలా నిర్వహించబడ్డాయి. ఫకీరుల జరాబులతో ఊరేగింపు నిర్వహించబడింది. అనంతరం జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు (సలాం, ఫాతిఖా) నిర్వహించగా, ఈ కార్యక్రమంలో సుభానీ అల్ మస్కూరీ గారు పాల్గొన్నారు. ఆయన అందరి శ్రేయస్సు కొరకు ప్రత్యేక దువా చేశారు.ఈ సందర్భంగా సుభాని డాక్టర్ గారి ఆధ్వర్యంలో గంధపు ప్రసాదాల పంపిణీ జరిగింది. గ్రామస్తులు, పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం పూర్తిగా ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సమైక్యతకు ప్రతీకగా మారింది.








