
అమరావతి:17-10-25:-అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సీఎం సమీక్షలో ప్రత్యేకంగా చర్చించారు.ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు
గనుల శాఖ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3320 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధారించిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో గనుల శాఖ నుంచి గతంతో పోలిస్తే 34 శాతం మేర అదనపు ఆదాయం రావచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మాంగనీస్ వంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతం అదనపు ఆదాయం సాధించనున్నట్లు స్పష్టం చేశారు.







