
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళల కోసం ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ఈ గ్రీవెన్స్ డే ను నిర్వహిస్తున్నాం. ఈ గ్రీవెన్స్ గడచిన నాలుగు వారాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వందకు పైగా మహిళల నుంచి వివిధ సమస్యలపై వినతులు అందాయి. వాటిలో దాదాపు 60కి పైగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలిగాం,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.మహిళలు పోలీస్ స్టేషన్లు లేదా ఇతర కార్యాలయాల్లో న్యాయం దొరకలేదని భావించి ఇక్కడికి వస్తున్నారు. ఆడవాళ్లు ధైర్యంగా తమ సమస్యలతో ఇక్కడికి వస్తున్నారన్నారు. తక్షణ పరిష్కారం – న్యాయ సహాయం అందుబాటులోనే సాధ్యమైన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్సై గారు, లీగల్ అడ్వైజర్ శ్రీమతి విజయలక్ష్మి గారు ప్రతీ మంగళవారం ఒక గంట సమయం కేటాయించి ఇక్కడికి వస్తున్నారు. చట్టపరమైన లేదా భద్రతకు సంబంధించిన సమస్యలపై వెంటనే సలహా, సహాయం అందిస్తున్నారు. దీంతో అనేక సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మహిళల సమస్యల విభాగాలవారీగా స్పందన రేషన్ కార్డు స్ప్లిటింగ్, కొత్త పెన్షన్‌లు, వందనం పథకం లబ్ధిదారుల సమస్యలు, స్థానిక నీటి మరియు శానిటేషన్ సమస్యలు, అప్పు మోసాలు, ఈవ్‌టీజింగ్ వంటి సమస్యలతో మహిళలు వస్తున్నారు. చిన్న సమస్యలకు రెండు రోజుల్లోనే పరిష్కారం లభించేలా అధికారులతో సమన్వయం చేస్తూ ఉన్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు స్పందించడంలో నిర్లక్ష్య ధోరణి కనపడుతోంది. ఇకపై ప్రతి శాఖపై వేర్వేరు సమీక్షలు నిర్వహించి, అవకతవకలు, ఆలస్యం జరిగే చోట కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎవరు ఆటంకం కలిగించినా క్షమించం,” అని గళ్ళా మాధవి హెచ్చరించారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు గుంటూరులో ప్రజా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయన్న పత్రికా కథనాలను చాలా సీరియస్‌గా తీసుకున్నాం. కొన్ని చోట్ల సరుకులు బ్యాక్‌డోర్ ద్వారా బయటకు వెళ్తున్నాయని, కొన్ని డీలర్లు పెద్దల పేర్లు చెబుతూ అవినీతికి పాల్పడుతున్నారని సమాచారం వచ్చింది. ఈ వ్యవహారాలపై ఇప్పటికే తహసీల్దార్, డి.టిలతో సమీక్షా సమావేశం నిర్వహించాం. ప్రతి రేషన్ షాప్ వద్ద అధికారుల సమక్షంలో పంపిణీ జరిగేలా ఆదేశాలు జారీ చేశామని ఎమ్మేల్యే గళ్ళా మాధవి తెలిపారు.ప్రజా పంపిణీ కార్యక్రమంలో అవినీతి జరిపే వారిపై ఉక్కుపాదం మోపుతాం. నేను స్వయంగా ఈ అంశంపై సీఎస్ గారికి రాతపూర్వక రిప్రజెంటేషన్ ఇచ్చాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియా పూర్తిగా అంతరించేవరకు నేను వెనక్కి తగ్గను,” అని గళ్ళా మాధవి హెచ్చరించారు.*మహిళల సంతృప్తి “ఈ మహిళా గ్రీవెన్స్ కు మహిళలు నిస్సంకోచంగా వచ్చి సమస్యలు చెప్పుకునే వేదికగా గ్రీవెన్స్ డే మారింది. ఇక్కడ చెప్పుకున్న సమస్య పరిష్కారమవుతుందనే భరోసా మహిళలకు కలగడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.







