chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

vijayawada lo vasantham:విజయవాడలో ‘వసంతం-2025’ చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభంమంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఆవిష్కరణ

విజయవాడ, నవంబర్ 5:-విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ‘వసంతం–2025’ చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ వార్షిక కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాల చేనేత, చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులతో 70కిపైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

మంత్రి లోకేష్ ప్రతి స్టాల్‌ను సందర్శించి, ఉత్పత్తుల వివరాలను ఆరా తీశారు. ఆ తరువాత ప్రకృతి సహజ రంగులతో తయారైన ‘కొత్తూరు వసంత వర్ణ’ పేరుతో నూతన చేనేత బ్రాండ్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్. రంజన, రాష్ట్ర క్రాఫ్ట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker